టాలీవుడ్ స్టార్
హీరో ప్రభాస్ స్టార్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన సలార్
సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో
కేజిఎఫ్ హీరో యష్ ఒక గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు అన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వార్తల ఇప్పటివరకు చిత్ర బంధం మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో యశ్ నటించబోతున్నట్లుగా చైల్డ్ సింగర్
తీర్థ సుభాష్ వెల్లడించారు.
అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ సలార్ సినిమాలో
ప్రభాస్ పృద్విరాజ్ తో పాటు యశ్ కూడా కనిపించబోతున్నారు అని వెల్లడించారు. అనుకోకుండా ఆమె
యష్ పేరును చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్
మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. దీంతో సలర్ లో యశ్ ఉన్నాడు అని క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వార్త విన్న
ప్రభాస్ అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు. దాంతోపాటు సినిమాలోని మెయిన్ ట్విస్ట్ ను లీక్ చేయడంపై ఆమెపై చాలామంది
ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె చేసిన పలు కామెంట్లపై సోషల్
మీడియా ద్వారా మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది తీర్థ.
కేజిఎఫ్ సినిమాను తాను చాలా సార్లు చూశానని, అందులో యశ్ నటన చాలా నచ్చిందని చెప్పింది.
కేజీఎఫ్ మూవీతో పాటు ఆ
సినిమా మ్యూజిక్,
హీరో యశ్ గురించి మా
నాన్న చాలా సార్లు చెప్పారని, ఆయన మాటలను బట్టి యశ్ కూడా సలార్‌లో ఉంటాడని అనుకొని పొరపాటుగా అతడి పేరు చెప్పానని అన్నది. సలార్‌లో యశ్ రోల్ గురించి చేసిన కామెంట్స్‌పై తనను ట్రోల్ చేయద్దని కోరింది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!