నితిన్... వేణు శ్రీరామ్ "తమ్ముడు" మూవీ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నితిన్ తాజాగా "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ... కథా రచయిత గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 8 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది.


దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర భారీ మొత్తం లో కలెక్షన్ లను దక్కడం లేదు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా రోజుల క్రితమే నితిన్ ... వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే మూవీని  ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ ఎప్పటికీ పూర్తి అయ్యింది.


ఇకపోతే ఇన్ని రోజుల పాటు "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" సినిమా ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా సమయాన్ని గడిపిన నితిన్ తాజాగా తమ్ముడు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ డిసెంబర్ 11 వ తేదీ నుండి ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ షెడ్యూల్ ను మారేడుమిల్లి లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు మారేడు మిల్లి లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: