పూజా హెగ్డే కు చంపేస్తామంటూ బెదిరింపులు..!!
ఈ విషయాన్ని పాపులర్ సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. అయితే ఇది దుబాయ్ లో జరిగిన గొడవ తర్వాత పూజా హెగ్డే ను ఇలా చంపేస్తామంటూ బెదిరించినట్లు సమాచారం.. దీంతో వెంటనే పూజ హెగ్డే ఇండియాకు తిరిగి వచ్చిందట.అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం కాస్త ఆందోళనలకు గురవుతున్నారు.. ఈ విషయం తెలిసిన పూజ అభిమానులు తనని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నారు.అయితే ఈ విషయం పైన పూజ హెగ్డే ఇప్పటి వరకు ఏ విధంగా స్పందించలేదు.. అయితే ఈ రూమర్స్ పైన పూజ హెగ్డే టమ్ మాత్రం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదని పూజా టీం ఫ్రీ ప్రెస్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా నకిలీ వార్తలని తెలియజేశారు. పూజా హెగ్డే ను బెదిరించారంటూ పోస్ట్ చేసిన వ్యక్తి కాసేపటికి ఆ పోస్ట్ ని డిలీట్ చేయడం జరిగిందట.. చివరిగా పూజ హెగ్డే సల్మాన్ తో కలిసి కిసి కా బాయ్ కీసి కీ జాన్ వంటి సినిమాలలో నటించింది ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.