టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇకపోతే గతంలో వీరి కాంబినేషన్ లో జాంబీ రెడ్డి అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి. ఇలా జాంబి రెడ్డి లాంటి విజయవంతమైన సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కావడంతో హనుమాన్ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగి పోయాయి. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నైజాం యొక్క థియేటర్ హక్కులను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కి భారీ ధరకు అమ్మివేసినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితమే డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రి సంస్థ వారు హనుమాన్ మూవీ యొక్క నైజాం హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.