అభిమానులకు ట్విస్ట్ ఇవ్వబోతున్న సలార్ మేకర్స్....!!
అయితే మూవీలో ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందట. మొదటి 40 నిమిషాలు ప్రభాస్ కనిపించడు అట. ప్రశాంత్ నీల్ పృథ్విరాజ్ చుట్టూ కథనడుపుతాడట. ఖాన్సార్ అనే ఒక ప్రాంతం, దాని మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసే గ్యాంగ్స్, కీలక పాత్రల పరిచయంతో కూడిన సెటప్ ఉంటుందట.ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇది నిరాశపరిచే అంశం. థియేటర్స్ లో కూర్చున్న అర్థగంటకు కూడా ప్రభాస్ కనిపించకపోతే ఫ్యాన్స్ అసలు ఊరుకుంటారా?. అందుకే పరోక్షంగా ప్రేక్షకుల మైండ్ ట్యూన్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఫ్యాన్స్ ని కూడా కన్విన్స్ చేసేలా ప్రభాస్ ఎంట్రీ లేటుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పృథ్విరాజ్ ప్రధానంగా సాగుతుందని చెప్పకనే చెబుతున్నారు.ఈ పరిణామాలు గమనిస్తుంటే సలార్ పార్ట్ 1కి హీరో పృథ్విరాజ్ హీరో అన్నట్లు తయారైంది. ప్రభాస్ జస్ట్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. సినిమా విడుదలయ్యే వరకు ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? అనేది తెలియదు..