నేను ఆ సీన్ చేయకుంటే.. యానిమల్ హిట్ అయ్యేది కాదు : డియోల్
ట్రైలర్, టీజర్ ఇక సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి అని చెప్పాలి. అయితే ఇక మూవీ విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లకు తరలి వెళ్లారు. ఇక ఈ మూవీలోని ప్రతి పాత్ర కూడా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అయితే సినిమాలో కీలకపాత్రలో నటించాడు బాబి డియోల్. తన విలనిజంతో అదరగొట్టాడు. ఏకంగా అత్యంత క్రూరంగా ఉండే పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ మూవీలో ఒక మూవీలో ఏకంగా వైవాహిక అత్యాచారం సీన్ చేశాడు. అయితే ఈ సీన్ పై విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.
ఇక ఇలా వైవాహిక అత్యాచారం సన్నివేశంపై వస్తున్న విమర్శలపై స్వయంగా బాబి డియోల్ స్పందించాడు. మారిటల్ రేప్ ను ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదని..తక్కువ టైంలోనే విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇక ఆ పాత్రకు ఆ సీన్ తప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ మేము అలా చేసి ఉండకపోయి ఉంటే మూవీ హిట్ అయ్యేది కాదు అంటూ బాబి డియోల్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 750 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అదరగొట్టింది అని చెప్పాలి.