వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి"..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరో గా మంచు గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఆ తరువాత ఈ నటుడు జాతి రత్నాలు అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ నటుడి క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో తెలుగు సినీ పరిశ్రమలో పెరిగింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరో గా నటించాడు.



ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.


 ఇక ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను "జీ" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: