తెలుగోళ్లు ఆ డైరెక్టర్ ని రిజెక్ట్ చేయడానికి కారణం....??
అలా సందీప్ ప్రతిభను అంచనా వేయడంలో హీరోలతో పాటు నిర్మాతలు కూడా పూర్తిగా విఫలమయ్యారు. సందీప్ సినిమాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. అందుకే అది హిట్ అవుతుందా, లేదంటే విమర్శలు పాలవుతామా అన్న సందేహం చాలా మంది స్టార్ హీరోలకు ఉంటుంది. యానిమల్ సినిమా కూడా బోల్డ్ సీన్స్ తో ఒక అడల్ట్ కంటెంట్ లాగా ఉంటుంది. అందువల్ల తెలుగులో ఏ హీరో కూడా ఈ సినిమా తీసేందుకు ఒప్పుకోలేదు.కట్ చేస్తే ఈ మూవీ ఇప్పుడు రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నతో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికే రూ.700కు పైగా కోట్లు వసూలు చేసింది.ఈ సినిమాని విమర్శించే వారు ఏ స్థాయిలో ఉన్నారు ప్రశంసించే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నిజ జీవితంలో మనుషులు ఎలా ఉంటారో అచ్చం అలాగనే ఈ సినిమాలో సందీప్ చూపించాడు అందుకే ఇది చాలామందికి బాగా కనెక్ట్ అయ్యింది. చదువుకున్న వాళ్ళు కూడా దీనిని పొగుడుతున్నారు. మొత్తం మీద ఒక ప్రత్యేక ప్రతిభను కలిగి ఉన్న సందీప్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇప్పుడు అందరి దృష్టిని తన వైపే తిప్పుకుంటున్నాడు.