గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కేజిఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోంది. కాగా ఈ సినిమా రెండు పార్ట్లుగా రాబోతోంది. ఇక డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా పార్ట్ వన్ విడుదల కాబోతోంది. అయితే రిలీజ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఈ సినిమా మరొక వారం రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుండడంతో ప్రభాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా
ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. కేజీఎఫ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ..ప్రశాంత్ నీల్ నా 21 ఏండ్ల కెరీర్‌లో ఉత్తమ డైరెక్టర్ అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. గత 21 ఏండ్లలో నాకు ఒక్కసారి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. కేవలం నెలలోనే మేమిద్దరం చాలా క్లో్జ్ అయ్యాం. ప్రశాంత్‌నీల్‌తో భారీ కమర్షియల్ సినిమా చేస్తున్నానని చెప్పాడు ప్రభాస్. ఇకపోతే ఇటీవల సలార్ నుండి మొదటి లిరికల్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మొదటి పాటతో సినిమాపై అంచనాలు
నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించబోతోంది. ఆమెతో పాటు జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. సలార్ లో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ది కింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేరళలో పృథ్విరాజ్ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ హౌజ్ విడుదల చేస్తుండగా.. నైజాంలో టాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సలార్‌ను రిలీజ్ చేస్తోంది...!!