తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన కమీడియన్ లలో యోగి బాబు ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో కోలీవుడ్ స్టార్ హీరోలు ... మీడియం రేంజ్ హీరోలు నటించిన దాదాపు అన్ని సినిమాలలో కూడా కనిపించాడు. అలాగే ఈయన తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను అలరించి చాలా సినిమాల విజయాలలో అత్యంత కీలక పాత్రను పోషించాడు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు నేరుగా ఏ తెలుగు సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ ఈయన నటించిన అనేక తమిళ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి విడుదల అయ్యాయి.
అలాగే అందులో చాలా సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దీనితో ఈయన కు తెలుగు లో కూడా అదిరిపోయే రేంజ్ ఇమేజ్ ఉంది. ఇలా నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోయిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న యోగి బాబు మరికొన్ని రోజుల్లో నేరుగా ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాలో యోగి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఈయనే తాజాగా స్వయంగా ప్రకటించాడు. ఇలా యోగి బాబు , ప్రభాస్ హీరోగా రూపొందబోయే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే యోగి బాబు క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ , మారుతి కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.