ఖైదీ, విక్రం వంటి యాక్షన్ ఎమోషనల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇక ఈ సినిమాలతో ఈ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో వినిపించిందో మనందరికీ తెలిసిందే. కాగా ఈ ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లోకేష్ కనగరాజు. కాగా ఈ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో తన తదుపరి సినిమాని చేస్తున్నాడు. తలైవా 171 గ వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన
ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలి అని లోకేష్ కనకరాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనకరాజు ఇప్పటికే ఒక బాలీవుడ్ నటుడుని కూడా సంప్రదించినట్లుగా వార్తలు వినిపించాయి. కాగా ఆ బాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్. ఇటీవల జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనగరాజ్ షారుఖాన్ ని సంప్రదించి విషయాన్ని కూడా వివరించారట.
కానీ షారుక్ ఖాన్ మాత్రం తాను ఇప్పటికే చాలా సినిమాల్లో అతిధి పాత్రలు పోషించాను అని ప్రస్తుతం తన వరుస సినిమాలు చేస్తున్నట్లుగా తన సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నట్లుగా షారుక్ ఖాన్ లోకేష్ కనగరాజ్ కి చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి. దీంతో మరో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను లోకేశ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై రణ్వీర్ ఆసక్తిగా ఉన్నారని, కథ కూడా వినేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!