అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఈ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు బాలయ్య. అంతేకాదు ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకొని కమర్షియల్ గాను సక్సెస్ సాధించాయి. దాంతో ఇండస్ట్రీలో బాలయ్య మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అంతేకాదు స్టార్ హీరోలు కమర్షియల్ డైరెక్టర్స్ కి అందుబాటులో లేకపోవడంతో వాళ్లకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారారు బాలయ్య. బోయపాటి శ్రీను, బాబి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్, సంపత్ నంది.. ఇలాంటి కమర్షియల్ డైరెక్టర్స్ తో పాటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే చాలామంది డైరెక్టర్స్ తో సినిమాలు
చేయడానికి ఈ జనరేషన్ లో ఉన్న టాప్ 6 స్టార్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కమర్షియల్ గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న బాలయ్య ఆ డైరెక్టర్స్ కి నెంబర్ వన్ ఛాయిస్ గా నిలిచాడు. పైన పేర్కొన్న టాప్ 6 స్టార్ హీరోలు ఈతరం స్టార్ డైరెక్టర్స్ అయిన త్రివిక్రమ్, రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు.. లాంటి సెలెక్టెడ్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. రెగ్యులర్ మాస్ డైరెక్టర్స్ తో ఈ హీరోలు కలిసి పని చేయకపోవడంతో వాళ్లు సీనియర్ స్టార్స్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలంటే భారీ
రెమ్యునరేషన్ అడుగుతాడు. కాబట్టి అది సినిమా బడ్జెట్ పై ప్రభావం చూపుతుంది. 100 కోట్ల బడ్జెట్ సినిమా అయితే నాగార్జున, వెంకటేష్, రవితేజల మార్కెట్ పనిచేయదు. కాబట్టి ఈ దర్శకులందరికీ మన బాలయ్యే నంబర్ వన్ ఛాయిస్ అయిపోయాడు. అందుకే బాలయ్యతో సినిమాలు చేసేందుకు కమర్షియల్ డైరెక్టర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య తో అయితే 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చేయొచ్చు. దానికి తోడు ఆయన రెమ్యునరేషన్ కూడా రీజనబుల్ గా అంటే దాదాపు 30 కోట్ల కంటే తక్కువ ఉంటుంది. ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ కి ఇటువంటి ఇబ్బంది ఉండదు.