ఆరాధ్య చేసిన పనికి సంబర పడుతున్న ఐశ్వర్య....!!

murali krishna
మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె నిత్యం తల్లి చాటు బిడ్డగా తన తల్లి ని విడిచి ఉండలేదు ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్య కూడా తన కూతురిని వెంట పెట్టుకొనే వెళుతూ ఉండడం మనం చూస్తుంటాము. ఇకపోతే ఇటీవల ఐశ్వర్యా రాయ్ అభిషేక్ ఇద్దరు కూడా విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్నీ పూర్తి గా అవాస్తవ మంటూ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఆరాధ్య స్కూల్ యాన్యువల్ డే ఈవెంట్లో ఎంతో సంతోషం గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉండడం తో ఐశ్వర్య విడాకుల వార్త లకు పూర్తిగా చెక్ పడింది.ఇకపోతే ఆరాధ్య బచ్చన్ మొట్ట మొదటిసారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం తో ఐశ్వర్యరాయ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా ఆరాధ్య ఒక ఇంగ్లీష్ నాటకం లో ఫర్ఫార్మెన్స్ చేసింది.

ఆమె చెప్పే డైలాగులు ఆమె హావభావాలు ప్రేక్షకులను అలాగే అభిమానులను కూడా ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఇలా ఆరాధ్య బచ్చన్ ఫర్ఫార్మెన్స్ చూసినటు వంటి ఐశ్వర్య అభిమానులు అచ్చం తల్లి పోలికల తోనే తన తల్లిలాగే నటన లో కూడా ఆరాధ్య అందరిని మెప్పిస్తుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.  ఈ విధంగా ఆరాధ్య బచ్చన్ ఎంతో అద్భుతమైనటు వంటి పర్ఫామెన్స్ ఇవ్వడం తో అక్కడే ఉన్నటు వంటి తన తల్లి ఐశ్వర్య తన కుమార్తె ను చూసి ఎంతగానో మురిసిపోయింది. ఈ సన్నివేశాలన్నింటినీ కూడా తన కెమెరాలు బంధిస్తూ కనిపించారు. అలాగే తన తాతయ్య అమితాబ్ బచ్చన్ కూడా తన మనవరాలు ప్రదర్శనను చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటు వంటి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: