బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ని అందజేసిన నాగార్జున..!!

Divya
ఇంస్టాగ్రామ్ లో రైతుబిడ్డగా మంచి పాపులారిటీ సంపాదించిన పల్లవి ప్రశాంత్ ఈసారి ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. కామన్ మ్యాన్గా హౌస్ లోకి వెళ్లి ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని అందుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటిసారి బిగ్ బాస్ హిస్టరీ లోని ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో విజేతగా నిలిచిన కంటిస్టెంట్గా పల్లవి ప్రశాంత్ పలు రికార్డులను సృష్టించారు.. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ -7 లోకి వచ్చిన తర్వాత మరింత క్రేజ్ అందుకోవడం జరిగింది.

అయితే ఇలాంటి వాళ్లు చాలామంది వచ్చారు కానీ ఎవరు పెద్దగా ఆకట్టుకోలేక పోతారని రూమర్స్ ఉంది కానీ వారందరి అంచనాలను అభిప్రాయాలను తప్పని నిరూపించి హౌస్లో తనదైన ఆటతీరుతో మాటతీరుతో ఎంతోమంది మనసులను గెలుచుకోవడం జరిగింది పల్లవి ప్రశాంత్.. ముఖ్యంగా రైతుబిడ్డ అనే ట్యాగ్ కొంచెం అతని సెంటిమెంటుకు బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు. బిగ్బాస్ ఇచ్చిన గేమ్స్ టాస్క్లలో కూడా యాక్టివ్ గా పాల్గొంటూ రతికా రోజు లాంటి కంటెస్టెంట్లను ప్రేమ పేరుతో తనను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించాడే తప్ప ఎలాంటి ప్రతీకారం తీర్చుకోలేదు.


చాలామంది కంటిస్టెంట్ తనని చాలా తక్కువగా చూసిన ఎన్నో మాటలు మాట్లాడిన మనసును గాయపరిచిన కేవలం తన దృష్టి ఎంత లక్ష్యం వైపే సాధించి బిగ్ బాస్ -7 విజేతగా ఒక చరిత్రను సృష్టించారు. హౌస్ లో నే కాదు బయట కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ తనకు అప్పటికే వివాహమైందని కొన్ని కోట్ల ఆస్తి ఉందని పలు రకాల టీమ్స్ నెగిటివ్ ప్రచారం చేసిన అవన్నీ ఏవి అతనిని ఆపలేకపోయాయి. ముఖ్యంగా ఓటింగ్లో రైతుబిడ్డకు మాత్రం తిరుగులేని మద్దతు లభించింది. దీంతో పల్లవి ప్రశాంత్ విజేతగా నాగార్జున ట్రోఫీ కూడా అందించడం జరిగింది. విజేతగా నిలిచిన అనంతరం ఆ డబ్బులను రైతులకే ఇచ్చేస్తానని కారు తన తండ్రికి అని నక్లెస్ తన తల్లికి బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: