గుంటూరు కారం ట్రైలర్ వచ్చేది అప్పుడే..?
అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది..గుంటూరు కారం సినిమాలో హీరోయిన్స్ గా శ్రీ లీల ,మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత నాగ వంశీ నిర్మిస్తూ ఉండడం గమనార్హం. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ అందిస్తూ ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం.. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పలు రకాల పోస్టర్స్ లో మహేష్ బాబుని అభిమానులు ఎలా అయితే చూడాలను కుంటున్నారో ఆ విధంగానే ఎలివేషన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
గతంలో మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా గుంటూరు కారం పై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఏ మేరకు ఎలాంటి రికార్డులను సైతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో చేస్తారో చూడాలి మరి. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఒక నెల గ్యాప్ తీసుకొని రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు చేయబోతున్నారు ఈ సినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలు తన డేట్ లను ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.