డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదిక ప్రకారం పెళ్లి గూర్చి చెప్పిన సమంత....!!

murali krishna
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు అనారోగ్యం కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది. ఈ రెస్ట్ మోడ్ లోనే ఆమె పలు దేశాలు తిరిగేస్తూ మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఇక అమెరికా వెళ్లి ఇటీవలే భూటాన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత కొద్దిరోజుల క్రితం హాయ్ నాన్న సినిమాను తన ఫౌండేషన్ పిల్లలతో కలిసి వీక్షించింది. ఇక త్వరలో క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్న ఆమె తాజాగా చాలా రోజుల తర్వాత నెటిజన్లతో ముచ్చటించింది.
నేడు ఆదివారం ఫ్రీగా ఉండటంతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తాను అని చెప్పడంతో పలువురు నెటిజన్లు తమ ప్రశ్నలు సంధించగా వాటికి సమంత సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా అని అడగగా సమంత సమాధానమిస్తూ కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దాని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని తెలిపింది. ఇక సమంత షేర్ చేసిన రిపోర్ట్ లో మొదటి సారి పెళ్లి చేసుకున్న వారు 50 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయి. రెండవసారి పెళ్లి చేసుకున్నవారు 67 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయని, మూడవసారి పెళ్లి చేసుకున్నవారు 70 శాతం విడిపోయే ఛాన్సులు ఉన్నాయని ఉంది. దీంతో ఇండైరెక్ట్ గా సమంత ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నించింది. ఇక లైఫ్ లాంగ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా సమంతా ఇలాగే ఉంటుందా లేక మళ్ళీ ఆమె పెళ్ళికి రెడీ అవుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: