ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనే సంగతి పక్కన పెడితే ఈ బిగ్ బాస్ అనేది చాలా పెద్ద చెత్త షో. దీనివల్ల సామాన్యులకు లాభం ఏమి లేదు. పశువులుగా మారడం తప్ప. ఈ షో వివాదాల సుడిగుండం. హౌస్‌లో కంటెస్ట్‌ల ఆటలైనా.. పాటలైనా.. వాళ్లేం చేసినా కూడా ఈ షో అనేది కేరాఫ్ కాంట్రవర్శీనే.సోషల్ మీడియాలో బిగ్ బాస్ గొర్రెలు చేసే అతి అయితే ఎంతో నీచంగా ఉంటుంది. పైగా ఈ గొర్రెలని రెచ్చగొడుతూ రివ్యూలు ఇచ్చే ఇంకో మంద కూడా ఉంది.
బిగ్ బాస్ షో ఎంత చెత్త షోనో ఆ చెత్త షోకి రివ్యూస్ ఇచ్చే యూట్యూబర్ల జాతి అంతకంటే దారుణమైన చెత్త.. ఆ ఆది రెడ్డి, స్పై ఆంటీ అని చెప్పుకునే ఓ లేడీ రివ్యూవర్.. ఇలాంటి పనికిమాలిన బిగ్ బాస్ రివ్యూవర్స్ బిగ్ బాస్ చూసే జనాలను రెచ్చగొట్టి తరువాత బయట జరిగే గొడవలకి ప్రధాన కారకులు అవుతున్నారు. వీరు ఇలా రెచ్చగొట్టడం వల్లే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు.బిగ్ బాస్ హౌస్ మేట్స్ బయటకి రాగానే వారిపై దాడి చేస్తున్నారు. ఫస్ట్ ఈ రివ్యూవర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. వీళ్ళు డబ్బులు కోసం చేసే పనికిమాలిన PR స్టంట్స్ వల్ల సామాన్య ప్రజలు జంతువుల్లా మారిపోతున్నారు.
ఇక లేటెస్ట్గా బిగ్ బాస్ -7 సీజన్ క్లైమాక్స్ అయితే చాలా దారుణం.. బిగ్ బాస్ హౌస్‌లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్ లైఫ్‌లో కూడా బిగ్ బాస్ అభిమానులు హద్దులు దాటారు. 105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ షోలో విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్.. ఇక రన్నరప్‌గా అమర్దీప్ నిలిచాడు. ఇక్కడే పెద్ద రాద్ధాంతం మొదలైంది. ప్రశాంత్-అమర్దీప్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద గొడవకు దిగారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర పార్టీసిపెంట్‌ల కార్లు, TSRTCకి చెందిన బస్సులపై దాడికి దిగారు. చాలా విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు కూడా చేశారు.
ఇక పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. అభిమానం పేరుతో చేసే ఇలాంటి పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.అలాగే ఈ సంఘటనలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అసలు ఈ బిగ్‌బాస్ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారాయన. బిగ్ బాస్ వినోదాన్ని ఆస్వాదించకుండా.. అభిమానం పేరుతో ఏమైనా చేయొచ్చా..? ఇలా హద్దులు మీరి బరితెగిస్తే చూస్తూ ఉండిపోవాలా? ప్రభుత్వ ఆస్తుల నష్టం వరకు వెళ్లారంటే వీళ్లని ఏమనాలి? ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.