మహేష్ ప్రత్యేకంగా దర్శకత్వ పర్యవేక్షణ చేసిన మూవీ అదేనా....!!

murali krishna
సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, కృష్ణ ని మించిన పెద్ద సూపర్ స్టార్ అవుతాడని ఆయన బాలనటుడిగా ఉన్నప్పుడే అందరూ అనుకున్నారు.పెద్దయ్యాక మొదటి సినిమా నుండే తన మార్కుని చూపిస్తూ స్టార్ అయ్యేందుకు అడుగులు వేసాడు. కెరీర్ ప్రారంభం లో మహేష్ బాబు పడిన కష్టం మామూలుది కాదు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన వాడు ఎలా అయితే కష్టపడుతాడో అదే రేంజ్ లో మహేష్ బాబు కూడా తనని తానూ నిరూపించుకోవడానికి చేసిన శ్రమ మామూలుది కాదు. కెరీర్ ప్రారంభం నుండే మహేష్ బాబు తన సినిమాల స్క్రిప్ట్స్ ని సొంతం గా తానే ఎంచుకునేవాడు.కృష్ణ గారి ప్రమేయం ఇందులో ఏమాత్రం ఉండేది కాదట. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ బాబు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.
 మహేష్ బాబు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ చిత్రానికి ఒక విలువ ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ ఎంపిక అలా ఉంటుంది మరీ. కథ వినగానే దాని ఫలితం కూడా ముందే చెప్పేస్తాడు.ఆయన ఫ్లాప్ చిత్రాలన్నీ కూడా పూర్తి స్క్రిప్ట్ వినకుండా, డైరెక్టర్స్ మీద గుద్ది నమ్మకం తో చేసినవే ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే మహేష్ లో కేవలం యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాదు, దర్శకత్వ నైపుణ్యం కూడా ఉందట. ఒక సినిమాకి అయితే మహేష్ బాబు చెప్పిన భారీ మార్పులు చెయ్యడం వల్లే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిందని అంటుంటారు. ఆ చిత్రం మరేదో కాదు, మహేష్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి చిత్రం.

ఈ సినిమా కథ ని ముందుగా పవన్ కళ్యాణ్ మరియు రవితేజ కి వినిపించిన సంగతి మన అడ్మరికీ తెలిసిందే.  పలు కారణాల వల్ల వాళ్లిద్దరూ ఈ చిత్రాన్ని చేయలేకపోయారు. ఆ తర్వాత మహేష్ వద్దకు ఈ సినిమా కథ వచ్చినప్పుడు మహేష్ వెంటనే ఒప్పుకున్నాడు కానీ, స్క్రిప్ట్ లో చాలా సన్నివేశాలను మార్పించాడట. హైదరాబాద్ రురల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తీస్తే బాగుంటుంది అని మహేష్ బాబు సూచించాడట. అంతే కాదు క్లైమాక్స్ లో పండుగాడు పోలీస్ ఆఫీసర్ ట్విస్ట్ పెట్టే ఆలోచన పూరీ జగన్నాథ్ లో మొదట్లో ఉండేది కాదట.
కానీ మహేష్ బాబు ఆ ట్విస్ట్ పెడితే ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అవుతాది. కచ్చితంగా సినిమా వేరే లెవెల్ కి వెళ్తాడు అని సూచింది ఆ ట్విస్టుని పెట్టించాడట. అలాగే ప్రతీ సన్నివేశం కూడా మహేష్ ప్రత్యేకంగా దర్శకత్వ పర్యవేక్షణ చేసేవాడట. అంటే మహేష్ ఈ చిత్రానికి దాదాపుగా డైరెక్టర్ అన్నమాట. ఒక సాధారణమైన స్టోరీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత ముమ్మాటికీ మహేష్ బాబు సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: