నిన్నటి వరకు ఎంతో రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది. గ్రాండ్ ఫినాలే లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్‌ను గెలుచుకున్నారు. కాగా అమరదీప్ రన్నరపుగా నిలిచారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ కి భారీ రేంజ్ లో ఆహ్వానం పలికారు అభిమానులు. అయితే అమర్ భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు అందుకుంటాడో తెలియదు కానీ ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కు మాత్రం టాలీవుడ్ లో వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మన టాలీవుడ్ లో తెలంగాణ స్లాంగ్ లో వచ్చే సినిమాలు భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయి.
అయితే ఇటీవల అలా చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం తెలంగాణ యాసను చాలా బాగా మాట్లాడుతున్నారు. కేవలం తెలంగాణ యాస మాత్రమే కాకుండా ప్రేక్షకులను కొత్తగా అనిపించే ఏ భాష అయినా సరే బాగా నచ్చుతుంది. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్
అయిన అర్జున్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రకి ఫిక్స్ అయ్యాడు. స్వయంగా ఈ విషయాన్ని డైరెక్టర్ స్టేజ్ పై ప్రకటించాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలు పల్లవి ప్రశాంత్ నటించిన బోతున్నట్లుగా తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ తన ఎమోషన్స్ తో జనాలకు కంటతడి పెట్టించాడు. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ రోల్స్‌లో అయితే కచ్చితంగా సక్సెస్ అవుతాడని.. మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాలో పల్లవి ప్రశాంత్ నటనకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ఎమోషనల్ రోల్స్ లో పల్లవి ప్రశాంత్ కు మరిన్ని అవకాశాలు వస్తాయి...!!