"సలార్" రిలీజ్ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబు , పృధ్విరాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... రవి బుస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.


ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి కూడా సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ లోని రిలీజ్ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 21.70 మిలియన్ వ్యూస్ ను ... 729 కే లైక్స్ ను సాధించింది.


ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం ప్రభాస్ , ప్రశాంత్ కాంబో లో ఈ మూవీ రూపొందడంతో ఈ మూవీ.పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: