బాలయ్య బాబు మూవీకి టైటిల్ ఎలా పెట్టారో తెలుసా....!!

murali krishna
నటసింహం నందమూరి బాలకృష్ణ40 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. రెండు, మూడు జనరేషన్ల ఆడియన్స్ ను అతడు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు.ఈ రోజుల్లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఎప్పుడో ఒకసారి హిట్స్ కొడుతుంటే బాలకృష్ణ మాత్రం అఖండ, భగవంత్‌ కేసరి, వీర సింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. బాలయ్య బాబు క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా భారీ విజయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బాలయ్య చెప్పే డైలాగులు, చేసే డ్యాన్సులు, కనబరిచే యాక్టింగ్ అన్నీ కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేస్తాయి.ఈతరం ఆడియన్స్ కూడా బాలయ్య బాబుకు వీరాభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడే ఇలా అనుకుంటే ఒకప్పుడు, అంటే సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సమయాల్లో బాలయ్య కోసం అభిమానులు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యేవారు.వీరి గురించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, బాలకృష్ణ తీసిన ఒక సినిమాకి అభిమానులే టైటిల్ పెట్టారు. ఆ సినిమా మరేదో కాదు నందమూరి బాలకృష్ణ, భానుప్రియ హీరో హీరోయిన్లుగా 1987లో రిలీజ్ అయిన అల్లరి కృష్ణయ్య. దీనిని నందమూరి రమేష్ డైరెక్ట్ చేశాడు. వనితా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై ఎన్. భాస్కర్, సి.హెచ్.సత్యనారాయణ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ 1986 జూన్ 10న బాలయ్య బర్త్‌ డే సందర్భంగా ప్రారంభమైంది.
అలా మొదలైన ఈ సినిమా నిర్మాణ పనులు చక చకా పూర్తయ్యాయి. మద్రాస్ ఏవీఎం స్టూడియోలో సాంగ్స్ రికార్డింగ్ జరిగింది. ఈ సినిమా కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందింది. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకుందీ మూవీ.అరకులోయ ప్రకృతి అందాల నడుమ షూట్ చేసిన ఇందులోని పాటలు ఒక విజువల్ త్రీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు.అయితే ఈ చిత్రానికి టైటిల్ ఫైనలైజ్ చేసే రెస్పాన్సిబిలిటీని అప్పటి పాపులర్ సినీవీక్లీ మ్యాగజైన్‌ శివరంజనికి అప్పగించారు. అయితే ఈ మ్యాగజైన్‌ నిర్వాహకులు తమ సొంతంగా టైటిల్ పెట్టడం ఇష్టం లేక తమ పాఠకుల సలహాలను కోరింది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. వేలాది టైటిల్స్ సజెస్ట్ చేశారు.
చివరికి దర్శక నిర్మాతలకు అల్లరి కృష్ణయ్య అనే టైటిల్ బాగా నచ్చేసింది. ఈ టైటిల్‌ను సుమారు 300 మంది అభిమానులు సజెస్ట్ చేశారు. దాన్నే సినిమా టైటిల్ గా ఖరారు చేయాలని ఇక మూవీ మేకర్స్ కూడా నిర్ణయానికి వచ్చారు.  అయితే మూవీ షూటింగ్ సమయంలో ఏవీఎం స్టూడియోలో లక్కీ డీప్ కండక్ట్ చేయగా.. బాలకృష్ణ డ్రా తీశాడు.అందులో విన్నర్‌గా పశ్చిమగోదావరి జిల్లా, పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన బి.ప్రకాష్ నిలిచాడు. కాగా నందమూరి రమేష్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్ పర్ఫామెన్స్ కనబరిచిన నిరాశపరిచింది. కానీ బాలయ్య ఫ్యాన్స్ టైటిల్ పెట్టిన సినిమాగా అల్లరి కృష్ణయ్య ప్రత్యేకంగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: