DJ టిల్లుని ఆడేసుకున్న మంచు మనోజ్..!!

Anilkumar
  ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ కోసం 'ఉస్తాద్' అనే సరికొత్త సెలబ్రిటీ గేమ్ షో ను మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్నాడు.  రీసెంట్ గానే మొదలైన ఈ సెలబ్రిటీ గేమ్ షో లో మొదటి గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని సందడి చేశారు.  ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. 'ఉస్తాద్' షో కి సెకండ్ గెస్ట్ గా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆడియన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజె టిల్లు తో కలిసి మంచి మనోజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. ఇక ఈ ప్రోమోలో మనోజ్ సిద్దు అని అడిగే కొన్ని ప్రశ్నలు అందుకు సిద్దు ఇచ్చిన ఆన్సర్స్ హైలెట్ గా నిలిచాయి. 

ప్రోమోని గమనిస్తే.. మనోజ్, సిద్దు ఇద్దరు కలిసి dj టిల్లు టైటిల్ సాంగ్ కి డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'సిద్ధూ ఏ స్క్రిప్ట్ అయినా కిస్ తో స్టార్ట్ చేస్తావంట కదా' అంటూ ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ ఫోటోలను రివిడ్ చేశాడు మనోజ్. దానికి సిద్ధూ నవ్వేసాడు. డీజే టిల్లు రాధిక లాగా నిజ జీవితంలో ఎవరైనా తగిలారా? అని అడిగాడు. ప్రోమోలో మనోజ్, సిద్ధు మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ఎప్పటిలాగే మనోజ్ తనదైన స్టైల్ లో కామెడీని పంచాడు. రెగ్యులర్ గా అన్ని షోల్ మాదిరిగా కాకుండా తనకి ఇష్టం వచ్చినట్లు సెట్ లో తిరగేస్తూ సోఫాలపై పడుకుంటూ మనోజ్ అల్లరి చేస్తుంటే..'ఇది షో లాగ లేదు ఆయన ఇంట్లో సోఫాపై దొర్లినట్టు ఉంది' అంటూ సిద్ధూ చెప్పడం

మరింత నవ్వులు పూయించింది. ఇక ప్రోమో చివర్లో 'ప్యార్ మే పడిపోయానే' అనే సాంగ్ ని మనోజ్ పాడుతుంటే సిద్దు దానికి తబలా వాయించడం హైలెట్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ ని డిసెంబర్ 21న ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. కాగా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ మొదలు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ 'DJ టిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా హీరోగా సిద్దు కి భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరో వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే dj టిల్లు సీక్వెల్ ని రెడీ చేశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: