ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సంక్రాంతి వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు విక్టరీ వెంకటేష్.ఫ్యామిలీ, కామెడీ, ఎమోషనల్, బయోపిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ డ్రామా సినిమాలలోనైనా అద్భుతంగా నటించగల టాలెంట్ వెంకటేష్‌కి ఉంది. సినిమాలోనే కాదు బయట కూడా వెంకటేష్ చాలా కూల్ పర్సన్. ఎప్పుడు కూడా ఎవరితో గొడవ పెట్టుకోవడం ఏ కాంట్రవర్సీలో జోలికి కూడా వెళ్లడు. చేసే సినిమాలు కంటెంట్ కూడా చాలా క్లీన్ గా ఉండేలా చూసుకుంటాడు.అయితే అలాంటి వెంకటేష్ కు ఒకానొక సమయంలో ఊహించని షాక్ తగిలింది. వెంకీ యాక్ట్ చేసిన ఒక మూవీ విడుదలకు ముందే కాంట్రవర్సీలో చిక్కుకుంది. అది మరేదో కాదు రవి రాజా పినిశెట్టి రూపొందించిన "కొండపల్లి రాజా". ఈ మూవీ విడుదలకు ముందే పెద్ద కాంట్రవర్సీని రగిలించింది. ఇందులో సెకండ్ హీరోగా సుమన్ నటిస్తే, ఒక కీ రోల్లో హీరో శ్రీకాంత్ యాక్ట్ చేశాడు.నిజానికి ఈ సినిమా మరో సినిమాకి రీమేక్. ఇద్దరి ప్రాణామిత్రుల మధ్య తిరిగే ఈ సినిమా మొదటగా హిందీలో జితేంద్ర, శతృఘ్న సిన్హా హీరోలుగా ఖుద్గర్జ్ టైటిల్ తో వచ్చింది. అది సూపర్ హిట్ కావడంతో అదే సినిమాను రజనీకాంత్ కోలీవుడ్ లో శరత్ బాబు తో కలిసి 'అన్నామలై'గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అయితే 1988లో "ప్రాణ స్నేహితులు" టైటిల్‌తో హీరో కృష్ణంరాజు ఈ హిందీ సినిమాని తెలుగు రైట్స్ తీసుకుని రీమేక్ చేశాడు. అదే సినిమాని వెంకటేష్ అనుమతి లేకుండా తీశాడని కృష్ణంరాజు కోర్టుకు కెక్కారు.దీనివల్ల ఆ మూవీ రిలీజ్ అవుతుందా కాదా అన్న ఉత్కంఠ అప్పట్లో నెలకొన్నది. చాలా రోజులు ఈ సినిమా విడుదల వ్యవహారంలో గొడవలు కూడా జరిగాయి. చివరికి చిత్ర నిర్మాతలు, "ప్రాణ స్నేహితులు" మూవీ మేకర్స్‌తో పాటుకృష్ణంరాజుతో రాజీకి రావడంతో ఈ సినిమా రిలీజ్ కి ఉన్న అడ్డంకులు క్లియర్ అయ్యాయి. దాంతో సినిమా థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. 1993లో విడుదలైన ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా దివ్యభారతిని తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె మాత్రం వేరే సినిమాతో బిజీగా ఉండి తనకు బదులుగా నగ్మాని తీసుకోవాలని మేకర్స్ ని ఒప్పించింది.