ఆ విషయంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటున్న నెటిజన్స్....!!

murali krishna
ప్రభాస్ సలార్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. దానికి మొదటి నుంచి ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కథల ఎంపికలో ఆచితూచి అడుగు వేయడంతోనే ఈరోజు ఈ విజయం అతనికి దక్కింది అని అనుకోవచ్చు. గత కొన్నేళ్లు వెనక్కి వెళితే ప్రభాస్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.వర్షం సినిమా ప్రభాస్ కెరియర్ లోనే అతడికి మొట్టమొదటి భారీ హీట్ ని అందించింది అంతకన్నా ముందు ఈశ్వర్, రాఘవేంద్ర వంటి మంచి సినిమాలు ఉన్నప్పటికీ వర్షం ఒక బ్లాక్ బాస్టర్ హీట్ ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈశ్వర్ సినిమా ఒక బస్తీలో సాగే కథ అలాగే మాస్ హీరోగా ప్రభాస్ ని గుర్తించేలా చేసింది.ఆ తర్వాత రాఘవేంద్ర సినిమా అతనిలోని భక్తి కోణాన్ని కూడా చూపించి హిట్టు వచ్చేలా చేసింది. ఇక వర్షం సినిమా గురించి చెప్పేది ఏముంది అది ఒక సూపర్ కమర్షియల్ ఫార్ములా. వర్షం హిట్ రాగానే అడవి రాముడు వంటి ఒక భిన్నమైన సినిమాతో కూడా తెరపైకి వచ్చాడు. ఇది పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ ఈ చిత్రం తర్వాత చక్రం అనే మరొక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..  చక్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసిన ఆ తర్వాత చత్రపతి లాంటి ఒక అద్భుతమైన చిత్రం ప్రభాస్ ఖాతాలో పడింది.
ఇచ్చిన తర్వాత పౌర్ణమి సినిమా తీసిన అది కూడా ప్రభాస్ కి మంచి పేరును తీసుకొచ్చింది అలాగే దీని కథకు అంతకుముందు తీసిన కథలతో ఎలాంటి సంబంధం లేకుండా తీయడం విశేషం. అక్కడి నుంచి మొదలు నిన్న మొన్నటి ఆది పురుష్ వరకు అన్ని కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండానే ఉంటాయి. బాహుబలి, సాహో, రాదే శ్యామ్ ఇలా అన్ని చిత్రమైన విచిత్రమైన కథలను ఎంచుకుంటూ తన కెరియర్ ను ముందు తీసుకెళ్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఇక సలార్( Salaar ) మరో రేంజ్ సినిమా అని అందరూ అంటున్నారు. ఇలా సంబంధమే లేని కథలతో సంబంధం లేని సినిమాలు తీస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం నిజంగా గొప్ప విషయమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: