'సలార్'లో నాకంటే పెద్ద విలన్ ఉన్నాడనుకున్నా.. కానీ : జగపతిబాబు

praveen
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ఇక ఇటీవల ఉదయం నుంచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూస్తూ అభిమానులు అందరూ కూడా తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వస్తుంది అన్న విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ అద్భుతంగా చూపించాడని.. అంతేకాదు ఇక ప్రతి సీక్వెన్స్ కూడా విజిల్స్ వేసేలా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.


 ఇక ప్రస్తుతం సలార్ సినిమాకు వస్తున్న టాక్ చూస్తే ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అనేది తెలుస్తుంది. అయితే ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించాడు జగపతిబాబు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో కఖాన్సర్ పేరు వినగానే నాకంటే ఒక పెద్ద విలన్ ఉన్నాడేమో అని అనుకున్నాను అంటూ జగపతిబాబు తెలిపాడు  కానీ ఆ తర్వాత ఖాన్సర్ అనేది ఒక ప్రాంతమని.. ఆ ప్రాంతానికి నేనే రాజుని అన్న విషయం తెలిసి షాక్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. నాకు మీ దర్శకత్వంలో నటించాలని ఉంది అని ఒకసారి ప్రశాంత్ నీల్ తో చెప్పాను అది గుర్తుపెట్టుకుని ఆయన సలార్ సినిమా కోసం ప్రతి నాయకుడు పాత్ర ఉందని ఫోన్ చేశారు.


 ఈ మూవీలో రాజమన్నార్ పాత్ర పోషించాను  ఇక ఈ పాత్ర తీరు లుక్ అన్ని కొత్తగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ మూవీలో ఖాన్సర్ అనే కోటను మనిషిలా భావించడం అనేది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కాన్సర్ గురించి తొలిసారి విన్నప్పుడు నాకంటే పెద్ద విలన్ కావచ్చు అనుకున్నాను. కానీ ఆ కోటకి నేనే రాజుని అన్న విషయం తర్వాత తెలిసింది. తమ తమ పాత్రలలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు అద్భుతంగా నటించారు అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు. కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: