అరుదైనా ఘనత సాధించిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్....!!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ గ్లింప్స్ రిలీజ్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారం లోకి వస్తున్నాయి. జనవరి నెల 1వ తేదీన దేవర గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వెరైటీ మ్యాగజైన్ లో చోటు దక్కడం గురించి తారక్ రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాలి. ఈ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్ల లో విడుదల కాలేదు. దేవర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా కొరటాల శివ యూనివర్స్ అనేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర మూవీలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ లాభాల్లో వాటా తీసుకుంటూ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.