చరణ్ - ప్రభాస్ మల్టి స్టారర్.. అలా మిస్ అయ్యిందట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు రియల్ లైఫ్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య స్నేహబంధం స్కూల్ దశ నుంచి కూడా కొనసాగుతూనే వస్తోంది. ఇక ఇద్దరు ఎక్కడ కనిపించినా కూడా ఎంతో ప్రేమగా పలకరించుకుంటూ ఇక పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా వస్తే చూడాలని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు


 బాహుబలి తర్వాత ప్రభాస్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్  కూడా అటు గ్లోబల్ స్టార్లుగా గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే   అయితే గతంలో చరణ్, ప్రభాస్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ తీయాలని ఓ స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేశాడట. కానీ కానీ ఊహించని రీతిలో మిస్ అయింది అన్నది తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అప్పట్లో తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన పూరి జగన్నాథ్. ప్రభాస్, చరణ్ తో ఒక మల్టిస్టారర్ తీయాలని అనుకున్నప్పటికీ అది పట్టాలెక్కలేదట. అయితే గతంలో హీరోల మధ్య ఉండే స్టార్ డం ను మేనేజ్ చేయడంలో.. డైరెక్టర్ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన హీరోల ఫ్యాన్స్ నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి.



 దీంతో దర్శక నిర్మాతలు ఇక స్టార్ హీరోలతో మల్టీస్టారర్ కాకుండా ఇండివిజువల్ గా సినిమా చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఈ క్రమంలోనే  పూరి జగన్నాథ్ ఒక పవర్ఫుల్  స్టోరీని రాసుకున్నాడట. కానీ  రామ్ చరణ్, ప్రభాస్ కాంబోలో రావాల్సిన సినిమా చివరికి ఆగిపోయిందట. ఇద్దరు హీరోల ఫ్యాన్ ను సాటిస్ఫై చేస్తానో లేదో అని భయపడి పూరీ వెనక్కి తగ్గాడట. అయితే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సూపర్ హిట్ అయింది. చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమాలో నటించగా ఇక ప్రేక్షకులను మెప్పించ గలిగాడు జక్కన్న. దీంతో అప్పటినుంచి ఎంతో మంది స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: