టాలీవుడ్ హీరోస్ ను తమ తమ స్టైల్ లో వాడుకున్న డైరెక్టర్స్ వాళ్లేనా....??
తర్వాత బాహుబలి సినిమాతో ఆ రేంజ్ మరింత పెరిగింది. ఇక చాలా ఏళ్లుగా ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ న్యాయం చేశాడు. అతడికి ఈ సలార్ వంటి గట్టి సినిమా ఇచ్చి ప్రభాస్ పని అయిపోలేదని నిరూపించాడు. ఇక ఇదే తరహా జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే అతన్ని కరెక్టుగా వాడుకున్న డైరెక్టర్లు కూడా ఇద్దరే ఇద్దరు.అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది వివి వినాయక్ గురించి. ఆది వంటి బంపర్ హిట్ ఇచ్చి తారక్ ని సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరో అనే స్థాయి కల్పించాడు. ఆ తర్వాత సాంబ, అదుర్స్ కూడా ఉన్నాయి. ఇక తారక్ విషయంలో రాజమౌళి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.సింహాద్రి, యమదొంగ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు వీరి కాంబినేషన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఇదే రకంగా మహేష్ బాబుని సరిగ్గా వాడుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. వీరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు కెరియర్ ను పోకిరి కి ముందు పోకిరి కి తర్వాత అనే వాళ్ళు కూడా కొంత మంది ఉంటారు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే సుకుమార్ అల్లు అర్జున్ ని వాడినట్టుగా మరే దర్శకుడు వాడలేదు ఆర్య సినిమాతో మొదలెట్టి ఆ తర్వాత పుష్ప సినిమాలతో వీరి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.