ఆ కారణంగా శృతిహాసన్ వైపు మొగ్గు చూపుతున్న దర్శక నిర్మాతలు....!!
మళ్లీ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్రాక్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి శృతి కెరీర్ గాడిలో పడింది. ఈ క్రమంలోనే సినిమాలపై దృష్టి పెట్టిన అమ్మడు సైలెంట్‌గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సలార్‌కు ఆ తర్వాత బాలకృష్ణతో వీర సింహారెడ్డి, చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రాలకు సైన్ చేయడంతో పాటు నాని హీరోగా వచ్చిన హయ్ నాన్న చిత్రంలో ఒక గెస్ట్ రోల్ కూడా చేసింది.. ఈ సినిమాలన్నీ ఈ యేడాదే విడుదలై శృతిహసన్ కు చిరస్మరణీయ భారీ విజయాలను అందించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా నెంబర్‌వన్ ప్లేస్‌ను సుస్థిరం చేసి పెట్టాయి.దీంతో అందరూ శృతిహాసన్ ని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు. శృతిహాసన్ చేతిలో ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు శృతిహాసన్ మరొకసారి ఫామ్ లోకి రావడంతో దర్శక నిర్మాతలు ఎక్కువగా శృతిహాసన్ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి శృతి హసన్ ఇంకా ముందు ముందు ఎలాంటి సినిమాలలో నటిస్తుందో చూడాలి మరి.