మంచు మనోజ్ తో రొమాన్స్ కి రెడీ ఐనా మెగా డాటర్....!!

murali krishna
మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. తాజాగా దీనికి సంబంధించి కీలక ఆప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఆఫిషియల్‌గా ప్రకటించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దాదాపు ఏడేళ్ల తరువాత ''వాట్ ది ఫిష్'' అనే సినిమాతో మంచు మనోజ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారు.వరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచియం అవుతున్నారు. ''వాట్ ది ఫిష్‌''లో పలువురు సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా హీరోయిన్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ''వాట్ ది ఫిష్‌''లో మనోజ్‌కు జోడిగా మెగా డాటర్ నిహారికను ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ రోజు నిహారిక పుట్టిన రోజు కావడంతో..సినిమాలోని ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వైట్ కలర్ స్కట్‌‌తో గ్లామరస్‌గా కనిపించి నిహారిక అభిమానులకు షాకిచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.దీంతో పెళ్లి పీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.అతనితో విడాకులు తీసుకుని.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అటు మనోజ్ వైవాహిక జీవితం కూడా అంత సాఫీగా సాగలేదు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవలే మనోజ్ - మౌనిక దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు.మనోజ్ - నిహారిక చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో 'వాట్ ది ఫిష్‌'పై అంచనాలు ఏర్పడ్డాయి..వచ్చే ఏడాది వాట్ ది ఫిష్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: