సంక్రాంతికి ముస్తాబవుతున్న టాలీవుడ్ పందెం కోళ్లు...!!
అయితే ‘సైంధవ్' నిర్మాత సెన్సారు కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో దర్శకుడు శైలేష్ కొలను హాజరయినట్టుగా తెలిసింది. ఈ సినిమాలే కాకుండా ఇంకో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి, కానీ ఇక్కడ తెలుగు సినిమాలకే ప్రాముఖ్యం ఇవ్వనున్నారు అని కూడా తెలుస్తోంది.ఈ సమావేశంలో జనవరి 12న విడుదలయ్యే ‘గుంటూరు కారం', ‘హనుమాన్' నిర్మాతలని ఒకరోజు ముందుకు జరపాలని సూచించారని తెలుస్తోంది. ఎందుకంటే ఒకేరోజు రెండు సినిమాలంటే రెవెన్యూ పోతుంది అనే ఉద్దేశంతో చెప్పారు, ‘హనుమాన్' నిర్మాతలు తమకి హిందీ భాషతో ఒప్పదం అయి పొయింది అందుకని ముందుకు జరగడం కష్టం అని చెప్పినట్టుగా తెలిసింది.ఇక ‘గుంటూరు కారం' నిర్మాతలు అలోచించి చెప్తాం అని అన్నట్టుగా తెలిసింది. ‘నా సామి రంగ' నిర్మాత తమ సినిమా కథ సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి, విడుదల వాయిదా వెయ్యడం కష్టం అని చెప్పారు. అయితే మిగతా సినిమాలన్నీ జనవరి 13, 14, 15 తేదీల్లో విడుదలవుతున్నాయి. మొత్తంవిూద ఈ సమావేశం చర్చలు అంత సానుకూలంగా జరగలేదనే చెప్పాలి.