ఆ సినిమా నేను చేసి ఉంటే.. ఇప్పుడు స్టార్ హీరోగా ఉండేవాడిని : శివాజీ
ప్రత్యేకమైన ఆటతీరుతో బిగ్ బాస్ చానిక్యుడు అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. కానీ త్రుటిలో టైటిల్ మిస్ అయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు శివాజీ. ఇకపోతే ఈ ఇటీవల తన కెరీయర్ గురించి పలు ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన, హీరోలకు డబ్బింగ్ చెప్పిన ఆ సినిమాలన్ని దాదాపుగా విజయం సాధించాయి అంటూ తెలిపిన శివాజీ.. నేను హీరోగా మాత్రం మరో స్థాయికి వెళ్లలేకపోయాను అంటూ తెలిపాడు. మిస్సమ్మ లాంటి సూపర్ హిట్ తర్వాత నా ఆటోగ్రాఫ్ మూవీ లో నటించే అవకాశం వచ్చింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ తర్వాత ఆ మూవీ రవితేజ చేతుల్లోకి వెళ్ళింది.
కానీ అప్పటికే నాకు ఉన్న పాపులారిటీ దృశ్య నా ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే సినిమా నా ఆటోగ్రాఫ్. రవితేజకి అంతగా సెట్ కాలేదు. ఎందుకంటే అప్పటికే రవితేజ మాస్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఆ సినిమా చేజారినందుకు ఎంతగానో ఇప్పటికీ బాధపడుతూ ఉంటా. అదే కాకుండా జెనీలియా, రాజా నటించిన మిస్టర్ మేధావి సినిమా కూడా నేనే చేయాల్సింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా నేను చేసి ఉంటే ఈ రోజు స్టార్ హీరోగా ఉండేవాడిని అంటూ శివాజీ తెలిపాడు. అంత అద్భుతమైన కథ అది. కానీ రాజాను హీరోగా ఎంచుకున్న తర్వాత స్క్రిప్టులో చాలా మార్పులు చేశారు. దీంతో ఇక ఆ సినిమా ఆడలేదు అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు