యానిమల్ సూపర్ హిట్.. మరో తెలుగు డైరెక్టర్ తో రణబీర్ సినిమా?

praveen
బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న రణబీర్ కపూర్ ఇటీవల ఒక సెన్సేషనల్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఒక సాలిడ్ హిట్టు కొట్టాడు. అయితే అప్పటివరకు కేవలం లవర్ బాయ్ గా మాత్రమే గుర్తింపును సంపాదించుకున్నాడు రణబీర్ కపూర్. ఇక ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు కూడా పూనకాలు తెప్పించడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. ఇక ఈ మూవీలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.


 ఈ క్రమంలోనే తాను పోషించిన పాత్రకి 100% న్యాయం చేసింది అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కేవలం బాలీవుడ్ లో మాత్రమే అభిమానులను సంపాదించుకున్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. కాగా ఇప్పుడు తన తర్వాత సినిమాను కూడా ఒక టాలీవుడ్ డైరెక్టర్ తోనే చేయబోతున్నాడట రణబీర్ కపూర్. ఇండస్ట్రీలో బోల్డ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాథ్ మూవీ చేయబోతున్నాడట. అయితే పూరి మూవీలో బోల్డ్ సీన్స్ ఉండకపోయినప్పటికీ డైలాగ్స్ మాత్రం కాస్త బోల్డ్ గానే ముక్కు సూటిగా ఉంటాయి అని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది సాదాసీదా హీరోలని తన సినిమాలతో స్టార్ హీరోలుగా మార్చింది కూడా పూరి జగన్నాథ్ అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సినిమా చేస్తున్నాడు. ఇక మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమాను ప్రకటించలేదు పూరి. కాగా ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ డైరెక్టర్.. రణబీర్ కపూర్ ను కలిశాడట. ఏకంగా ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించిన మీటింగ్ జరిగిందట. రెండు గంటల పాటు మాట్లాడుకున్నారని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే పూరి కాంబోలో రణబీర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: