తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించు కోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే చాలా మంది హీరోలు మంచి సక్సెస్ లను అందుకుంటుంటే మరి కొంత మంది మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే హీరో కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లు గా మిగులుతున్న నేపథ్యం లో బింబిసార సినిమా తో ఒక మంచి సక్సెస్ వచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమా మాత్రం నిరాశపరిచింది.ఇక దాంతో ఇప్పుడు డెవిల్ అనే సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక ఈ సినిమా తో మంచి సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ తనదైన రీతి లో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకత ను చాటుకుంటాడు. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది మరోసారి కొంచెం ఇబ్బందు ల్లో పడుతుంది. ఇక ఇలాంటి సమయం లో కళ్యాణ్ రామ్ ఆచితూచి అడుగులు వేస్తే మంచిది అని మరి కొంత మంది సినీ మేధావులు సైతం ఆయన విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇప్పటివ రకు కళ్యాణ్ రామ్ కెరియర్ ఒక హిట్టు, నాలుగు ఫ్లాప్ లు అన్నట్టు గా సాగుతుంది అంతే తప్ప వరుసగా రెండు మూడు హిట్లు అయితే ఆయన ఇప్పటి వరకు ఒకసారి కూడా కొట్టలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ఆ తర్వాత వచ్చే సినిమా తో కూడా భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే డైరెక్టర్ వశిష్ఠ హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రావాల్సిన బింబిసార 2 సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీది కి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.