గ్రేట్: అలాంటి ఘనత అందుకున్న తెలుగు ఏకైక హీరో jr. ఎన్టీఆర్..!!

Divya
RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. మొదటి పార్ట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారని ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.

వచ్చే ఏడాది బాలీవుడ్ లో వార్ -2 చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా అభిమానులు గర్వపడేలా ఎన్టీఆర్ మరొక అరుదైన రికార్డును సైతం సంపాదించారు..2023 లో ఆసియాలోనే టాప్-50 నటుల జాబితాలో ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ వారు తెలియజేయడం జరిగింది.. ఆసియా టాప్-50 నటుల జాబితాలో ఎన్టీఆర్కు 25వ స్థానం దక్కించుకోవడం గమనార్హం.. దీంతో ఎన్టీఆర్ అభిమానుల సైతం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఈ స్థానం సంపాదించుకున్న ఏకైక హీరోగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఏషియన్ టాప్ -50 లో మొదటి స్థానంలో షారుక్ ఖాన్ నిలవగ అలాగే ఆలియా భట్ ప్రియాంక చోప్రా రెండు మూడు స్థానాలను సంపాదించుకున్నారు.. రణబీర్ కపూర్ ఆరవ స్థానం కోలీవుడ్ హీరో విజయ దళపతి 8వ స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మాత్రం 25వ స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు హీరోగా పేరు సంపాదించారు. ఇటీవల దేవర సినిమా షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దీంతో దేవర సినిమా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: