షాక్: సూపర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దూత హీరోయిన్..!!
అలాంటి సూపర్ స్టార్ అనే పేరు గురించి ఇటీవలే దూత వెబ్ సిరీస్ లో నటించిన నటి పార్వతి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.. తమిళంలో ఈమె నటించిన "వూ"చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయింది ఆ తర్వాత ధనుష్ నటించిన మారియాన్, కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ తదితర చిత్రాలలో నటించింది పార్వతి. ఇటీవలే డైరెక్టర్ పారంజిత్ దర్శకత్వంలో వస్తున్న తంగలాన్ అనే సినిమాలో కూడా విక్రమ్ తో నటిస్తోంది. వీటితోపాటు నాగచైతన్య నటించిన దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
పలు రకాల సెలెక్టెడ్ చిత్రాలలో నటించిన పార్వతి మలయాళంలో దాదాపుగా 31 పైగా సినిమాలలో నటించింది ఇటీవలే ఒక భేటీలో సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ గురించి మాట్లాడుతూ సూపర్ స్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి గౌరవం ఉందంటూ కూడా ఆమె ప్రశ్నించింది.. అది జస్ట్ సమయానుకూలంగా చెప్పుకునేది మాత్రమే అంటూ తెలియజేసింది. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ కూడా తెలియజేసింది.. చివరిగా ఆ పేరుకి అసలు అర్థమే లేదని తెలియజేసింది.. తనని కూడా సూపర్ స్టార్ అనడం కంటే సూపర్ యాక్టర్ అని పిలవడమే చాలా ఆనందాన్ని ఇస్తుంది అంటూ తెలిపింది.. తనకు తెలిసినంతవరకు మలయాళం లో ఫాహద్ ఫాజిల్, ఆసిఫ్ అలీ, రామి కలింగల్ మాత్రమే సూపర్ యాక్టర్స్ అంటూ తెలిపింది.