ఊరు పేరు భైరవకోన మూవీలోని "హమ్మ హమ్మ" సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో టైగర్ అనే సినిమా రూపొందింది. ఆ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి కావ్య దాపర్ , వర్షా బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈచిత్ర బృందం ఈ సినిమా నుండి "హమ్మ హమ్మ" అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు.
 


ఈ పాటను సందీప్ కిషన్ , వర్షా బొల్లమ్మ పై తెరకెక్కించారు. ఈ పాటను రామ్ మిరియాల పాడగా  తిరుపతి జావనతో కలిసి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఈ సాంగ్ కి సాహిత్యం అందించడం విశేషం. ట్యూన్ క్యాచీగా ఉంది. మేకింగ్ వీడియోను ఖర్చుకు వెనుకాడకుండా తీశారని అర్థం అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలోని ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర సగర్వ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ మధ్య కాలంలో వరుస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకున్న సందీప్ కిషన్ ఈ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: