ఘనంగా ప్రముఖ నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు
నాగం తిరుపతి రెడ్డి సతీసమేతంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు సతీసమేతంగా హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసారు. వనపర్తి నియోజక వర్గం నుండి రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. 2024 డైరీ, క్యాలండర్‌ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం డా.నాగం తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ.. నిరంజన్ రెడ్డి గారికి, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు. తాను ఇప్పటి వరకు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తానని, అందరికీ సేవ చేసే ఆ భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సంవత్సరం నాలుగు వెంచర్లతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమా కూడా చేస్తానని తెలిపారు. డైరెక్టర్, 100 కోట్లు, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగం తిరుపతి రెడ్డి త్వరలోనే తన నాలుగో ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్లు సమాచారం.