పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల తర్వాతి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ టు ఫస్ట్ స్టార్ట్ చేస్తారా.. లేక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు అభిమానులు. చిరంజీవి రామ్ చరణ్ మల్టీ స్టార్ గా ఈ సినిమా తెరకెక్కితే మరింత
బాగుంటుంది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సైతం ఇప్పుడు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌ను ఫిక్స్ చేయాలి అని చూస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఆయన రెమ్యూనరేషన్ సైతం భారీగా పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలే ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అంతేకాదు సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా సరే ఆయన సినిమా చేస్తున్నాడు అంటే ప్రాణం పెట్టి చేస్తాడు.
కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన కుటుంబం కంటే ఎక్కువ ప్రాధాన్యత సినిమాలకు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతాయి అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో సైతం సలార్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ప్రభాస్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ కలెక్షన్లను సాధిస్తుండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది...!!