సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీలో రూ.460 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 500 కోట్లకి అతి చేరువలో ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర డంకీ, సలార్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ యానిమల్ డీసెంట్ రన్ తో 500 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వీకెండ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండు బడా సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ నటించిన డంకి, టాలీవుడ్ నుంచి ప్రభాస్ సలార్..
ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. ఈ బడా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో యానిమల్ థియేట్రికల్ రన్ కి బ్రేక్ పడుతుందని ట్రేడ్ నిపుణులతో సహా అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా హిందీలో సలార్, డంకీ కి వంటి సినిమాలు ఉన్నప్పటికీ యానిమల్ డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. అంతేకాకుండా ఇదే వారంలో 500 కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. యానిమల్ ఇప్పటివరకు 478 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నిన్న షారుఖ్ ఖాన్ డంకీ తో పోటీ ఉన్నప్పటికీ యానిమల్ ఇండియా వైడ్ గా ఏకంగా 2 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.
దీన్ని బట్టి నార్త్ లో యానిమల్ హవా ఇంకా కంటిన్యూ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. యానిమల్ కి ఇతర సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఈ వీకెండ్ లో కచ్చితంగా 500 కోట్లు క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఎలాగో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు ఉండడంతో ఈ సినిమా ఈజీగా 500 కోట్ల క్లబ్ లో చేయడం గ్యారెంటీ అని చెప్తున్నారు. మరో 22 కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే కేవలం హిందీ వెర్షన్ లోనే యానిమల్ 500 కోట్ల క్లబ్ లో చేరి ఈ రికార్డు క్రియేట్ చేసిన ఐదో సినిమాగా నిలుస్తుంది. ఇప్పటివరకు బాహుబలి 2, పఠాన్, గదర్ 2, జవాన్.. ఈ నాలుగు సినిమాలు మాత్రమే హిందీలో 500 కోట్లు కలెక్ట్ చేశాయి.