ఎట్టకేలకు కూతురిని కెమెరాకి పరిచయం చేసిన బాలీవుడ్ కపుల్..!!

Anilkumar
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మనిచ్చారు. మంచి తల్లీ తండ్రులు అనిపించుకోవడం కోసం.. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చి మరీ పాపను చూసుకుంటున్నారు ఈ బాలీవుడ్ జంట. రీసెంట్ గా ఫస్ట్ మ్యారేజ్ ఆనివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే  రణ్ బీర్ ఆలియా ఇప్పటివరకు కూతురి ముఖాన్ని కెమెరాలకు చూపించలేదు. సోషల్మీడియాలోను ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయలేదు. 

అంతే కాకుండా చిన్నారికి రెండేళ్లు వచ్చే వరకు.. ఫొటోలు పోస్ట్ చేయరని ఆలియా సన్నిహితులు తెలిపారు. ఇక ఎట్టకేలకు తమ కూతురిని కెమెరాకు పరిచయం చేశారు ఈ బాలీవుడ్ కపుల్. క్రిస్మస్ సందర్భంగా రణబీర్ ఆలియా కూతురుతో ముంబైలో సందడి చేశారు. మొట్టమొదటిసారి ఈ జంట తమ కూతురిని మీడియా ముందుకు తీసుకురావడంతో మీడియా వాళ్లంతా ఆ చిన్నారిని ఫోటోలు తీస్తూ రణ్ బీర్, ఆలియా జంటకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మొదటిసారి కూతుర్ని కెమెరాకి పరిచయం చేయడంతో రాహ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారుతున్నాయి. 

రణ్ బీర్, ఆలియాల ముద్దుల కూతురు రాహా చూడటానికి చాలా అందంగా, ఎంతో బబ్లీగా ఉంది. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ నెటిజన్స్ రాహ చాలా అందంగా ఉందని, ఎంతో క్యూట్ గా ఉందంటూ, పాపకి ఆలియా పోలికలే వచ్చాయంటూ.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రన్ బీర్ ఫ్యాన్స్ ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇక రణ్ బీర్ కపూర్ రీసెంట్ గా 'యానిమల్' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: