19 రోజుల్లో "హాయ్ నాన్న" కి వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ డిసెంబర్ 7 వ తేదీన వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 19 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి 19 రోజుల్లో నైజాం ఏరియాలో 12.03 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.65 కోట్లు , యు ఏ లో 2.51 కోట్లు , ఈస్ట్ లో 1.35 కోట్లు ,  వేస్టు లో 82 లక్షలు , గుంటూరు లో 1.25 కోట్లు ,  కృష్ణ లో 1.24 కోట్లు , నెల్లూరు లో 61 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19 రోజుల్లో 22.45 కోట్ల షేర్ ... 40.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 19 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 4.25 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 9.05 కోట్ల కలెక్షన్ దక్కాయి. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లో 35.75 కోట్ల షేర్ ...  68.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 27.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 7.25 కోట్ల వరకు లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: