ఆ ప్రాంతంలో భారీ నష్టాన్ని తెస్తున్న 'సలార్' మూవీ...!!!
ఎందుకంటే రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారి పరిశీలిస్తే దాదాపుగా అన్నీ ప్రాంతాలలో సినిమా దారుణంగా డ్రాప్ అయ్యినట్టు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ వసూళ్ల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. కేజీఎఫ్ చిత్ర దర్శకుడు మరియు బాహుబలి సిరీస్ హీరో అనగానే హిందీ బయ్యర్స్ ఈ చిత్రాన్ని కళ్ళు మూసుకొని కొనేశారు. కానీ మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ఈ చిత్రం ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేక డీలా పడింది.ఇక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా రాలేదు. ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిలు రావొచ్చని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంటే దాదాపుగా 140 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట.
పాజిటివ్ టాక్ వచ్చిన ఒక సినిమాకి ఈ రేంజ్ నష్టం ఇప్పటి వరకు రాలేదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి. రేపు లేబర్ హాలిడే కాబట్టి, రేపు మ్యాట్నీ షోస్ నుండి పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ లో ఇంకో మూడు రోజులు బలంగా ఆడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ దక్కడం చాలా కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక కర్ణాటక , తమిళ నాడు మరియు కేరళ వంటి ప్రాంతాల్లో అయితే భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద సలార్ క్లోసింగ్ కలెక్షన్స్ 500 కోట్ల రూపాయిల కంటే తక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి, మధ్యలో ఏదైనా మ్యాజిక్ జరిగి లాంగ్ రన్ వస్తుందో లేదో చూడాలి.