టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో అక్కినేని
నాగచైతన్య -చందూ మొండేటి. వీరిద్దరి కాంబోలో ఇదివరకే ప్రేమమ్,
సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచాయి..తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో
మూవీ రాబోతుంది.ఆ మూవీనే తండేల్..రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తండేల్
మూవీ తెరకెక్కిస్తున్నారు.NC23 గా వస్తున్న ఈ చిత్రంలో
కోలీవుడ్ భామ
సాయిపల్లవి నాగ చైతన్య సరసన
హీరోయిన్ గా నటిస్తుంది.. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో చైతూ
మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను
ఖుషీ చేస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ కు సంబంధించి తాజాగా అప్‌డేట్ బయటకు వచ్చింది. లైట్స్ ఆన్..స్టార్ట్ కెమెరా..యాక్షన్ అంటూ తండేల్ షూటింగ్ మొదలుపెట్టేసింది చైతూ టీం.తండేల్ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.
నాగచైతన్య మరియు ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. లవ్‌స్టోరీ
సినిమా తర్వాత చైతూ,
సాయిపల్లవి కాంబోలో వస్తున్న
సినిమా కావడంతో తండేల్
సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో
సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటికే
తెలంగాణ యాసలో వినోదాన్ని పంచిన సాయిపల్లవి.. ఈ సారి శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్ గాళ్‌గా ఎంతలా అలరిస్తుందనేది చూడాలి మరి.
2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ
సినిమా చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. తండేల్‌కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాప్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.కార్తికేయ 2 సినిమాతో పాన్
ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూమొండేటి నుంచి వస్తున్న
సినిమా కావడం అలాగే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.