పొలిటికల్ సపోర్టుపై హాట్ కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్..!!

Divya
డిఫరెంట్ మూవీస్ తో ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకొనే మంచి ఇమేజ్ను సంపాదించుకున్న వారిలో హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఈ ఏడాది తను నటించిన అమీగొస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది చివరిలో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో అభిషేక్ పిక్చర్ బ్యానర్ పైన అభిషేక్ నాయ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ సైతం వేగవంతం చేశారు చిత్రబృందం. ఇందులో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు పర్సనల్ విషయాలను కూడా తెలియజేశారు.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి తనని డెవిల్ సినిమాలో చూస్తారని తన సినిమా కన్న ఎన్టీఆర్ సినిమా గురించి ఎక్కువగా అభిమానులు అడుగుతున్నారని తెలిపారు.

ముఖ్యంగా దేవర చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాత కావడంతో ఎక్కువగా ఈ విషయాలను పంచుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడారు కళ్యాణ్ రామ్.. ఈసారి ఏపీ ఎన్నికలలో పోటీ పోటీ ఉండబోతోంది. ఒకానొక సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ టిడిపికి ప్రచారం చేశారు. ఆ తర్వాత తారక్ తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంచారు.కానీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ని పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వమని కోరుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా యాంకర్ ఈసారి పోటీ పోటీగా సాగుతున్న ఏపీ ఎలక్షన్స్ లో తారక్ మీరు ఏ సైడ్ ఉండబోతున్నారు అని అడగగా..

ఈ విషయం పైన కళ్యాణ్ రామ్ స్పందిస్తూ తాము ప్రస్తుతం ఏ దారిలో వెళ్తున్న అది కుటుంబ విషయం అది కుటుంబం ద్వారా వచ్చింది.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే అందరికీ చెబుతామని తెలిపారు.. ముఖ్యంగా నేను ఎన్టీఆర్ కలిసి తీసుకున్న తర్వాతనే ఒక స్టేట్మెంట్ ఇస్తాము.. సినిమా వేరు పొలిటికల్ వేరు అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: