పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్' మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే రూ.178 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక మూడు రోజులకు గాను ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.250 కోట్ల మార్క్ అందుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ సాధించింది విడుదలైన అన్నిచోట్ల రీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ తాజాగా నైజాంలో రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబట్టి నైజాం ఏరియా
టాప్ గ్రాసర్స్ లిస్ట్ లో చేరిపోయింది. అతి తక్కువ సమయంలోనే నైజాంలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచిన సలార్ 'అలవైకుంఠపురంలో' కలెక్షన్స్ సైతం వెనక్కి నెట్టి టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. సలార్ మూడు రోజుల్లోనే దాదాపు రూ 44.5 కోట్ల రూపాయల వసూళ్లు నైజాం ఏరియాలో సాధించింది. ఇక నాలుగు రోజులకు గాను రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ రాజమౌళి రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు నైజాం లో 'RRR' రూ.111.85 కోట్ల షేర్ తో మొదటి స్థానంలో ఉండగా 'బాహుబలి 2' రూ.68 కోట్ల షేర్ అందుకొని రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మరే సినిమా నైజాం ఏరియాలో 50 కోట్ల మార్క్ అందుకోలేదు. కానీ సలార్ నాలుగు రోజుల్లోనే 50 కోట్ల షేర్
దాటేసి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సలార్ తో నాలుగు రోజుల్లోనే తన రికార్డ్ ని తానే బ్రేక్ చేయడం విశేషం. సలార్ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడానికి వీకెండ్ తో పాటు క్రిస్మస్ హాలిడే కూడా కలిసి వచ్చింది. సలార్ రిలీజ్ అయిన నాలుగో రోజు క్రిస్మస్ హాలిడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. దాంతో నాలుగో రోజు సలార్ నైజాం లో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సలార్ ఊపు చూస్తుంటే ఈ సినిమాని నైజాంలో రిలీజ్ చేసిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందింన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా నటించారు.