చిరంజీవి లేకపోతే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని వెంకటేష్ కామెంట్స్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తన కెరియర్లో 75 చిత్రాలను పూర్తి చేసుకున్నారు. తన 75వ చిత్రం సైంధవ్ చిత్రంగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో వెంకటేష్ అభిమానుల సైతం తమ హీరో 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు పలు రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇందుకోసం సైంధవ్ నిర్మాతలు సైతం చాలా గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.. ఈ ఈవెంట్ కి చిరంజీవి రాఘవేంద్ర రావు గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. అలాగే నాని శ్రీ విష్ణు బ్రహ్మానందం ఆలీ అడవి శేషు తదితర సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో వెంకటేష్ తన 75వ సినిమాల ప్రయాణం గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసి చాలా ఎమోషనల్ అయ్యారు.. వెంకటేష్ కి చాలా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసిన విషయమే.. తాజాగా వెంకటేష్ మాట్లాడుతూ మా గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంతో తన సినీ ప్రయాణం మొదలయ్యిందని.. దాసరి విశ్వనాథ్ గారు వంటి ఎంతోమంది అగ్ర దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టమని తెలిపారు.

అభిమానులు ఇచ్చిన ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను జయపజయాలు చూడకుండా తన సినిమాలను ఆదరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. అయితే గతంలో చాలా సార్లు సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను చిరంజీవి గారు లేకుంటే సినిమా మానేసి తన హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని అంటూ తెలియజేశారు. అయితే అలాంటి సమయంలోనే 9 సంవత్సరాలు విరామం నుండి మళ్లీ ఖైదీ -150 సినిమాతో బ్లాక్ బాస్టర్ అందడం చూసి తన నటన కొనసాగించాలనుకున్నానని తెలిపారు.. ముఖ్యంగా తన తోటి హీరోలలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి వారు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వాళ్ళని అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు చేస్తున్నానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: