పోస్టర్ల తోనే భారీ హైప్ సృష్టిస్తున్న మహేష్.. గుంటూరు కారం నుంచి అప్డేట్..!!
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని చిత్ర బృందం తెలియజేశారు. దీంతో చిత్ర బృందం కచ్చితంగా జనవరి 12న ఈ సినిమా విడుదల చేయడానికి తక్కువ సమయం ఉండడంతో పలు రకాల పోస్టర్లతో ఈ సినిమాకి భారీ హైప్ ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. అలాగే మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది.
గుంటూరు కారం సినిమా నుంచి గతంలో విడుదలైన పోస్టర్లలో ఎక్కువగా మహేష్ బాబు బీడీ తాగుతున్నట్లుగా పలు రకాల పోస్టర్లను డాన్స్ ఫోటోలను రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక పోస్టుని అప్డేట్ చేశారు చిత్ర బృందం.. మహేష్ బాబు బాడీలో మోస్ట్ డేంజరస్ పార్టు ఆయన కళ్ళని చెప్పవచ్చు. కేవలం కళ్ళతోనే డైలాగు చెప్పగలగే ఏకైక హీరోగా కూడా మహేష్ బాబు పేరు సంపాదించారు.. మహేష్ బాబు కళ్ళు ఎప్పుడు కూడా పులికల్ల లాగా ఉంటాయని డైలాగు గతంలో త్రివిక్రమ్ రాశారు.. ఇప్పుడు ఇదే డైలాగ్ ని నిజం చేస్తూ గుంటూరు కారం చిత్రాల నుంచి ఒక పోస్టర్ను విడుదల చేశారు. లుంగీ ఎగ్గట్టి సీరియస్ గా ఎవరినో చూస్తున్నట్లుగా ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ చూస్తూ ఉంటే జనవరి 12న అభిమానులకు ఫుల్ మీల్స్ గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తోంది..