ఏకంగా ఆ స్టార్ హీరో రికార్డ్ కూడా బ్రేక్ చేసిన సలార్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. వీక్ డేస్ లో సైతం భారీగా వసూళ్లు చేస్తుంది ఈ సినిమా. అయితే మంగళవారం రోజు సైతం ఈ సినిమా నైజాంలో ఐదు కోట్లకు పైగా వసూళ్లు ను కలెక్ట్ చేసి షాప్ ఇచ్చింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 250 కోట్ల వరకు షేర్లను రాబెట్టిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే 240 కోట్ల షేర్ కలెక్ట్ చేసి  షాక్ ఇచ్చింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 500 కోట్ల మార్క్ ను


 టచ్ చేసే దిశగా దూసుకుపోతోంది.  ఈ క్రమంలోనే సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే.. ఇప్పటివరకు తెలుగు వెర్షన్ పరంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా నిలిచింది. ఈ సినిమా ఒక్క తెలుగు వెర్షన్ తోనే వరల్డ్ వైడ్ గా రూ.160 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును  ‘సలార్’ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఒక్క తెలుగు వెర్షన్ తోనే.. అదీ 5 రోజుల్లోనే రూ.166 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి…


నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ 3 సినిమాలు మూడు కూడా ప్రభాస్ నటించిన సినిమాలే కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక నుండి నాన్ – ప్రభాస్ పేరిట కూడా రికార్డులు నమోదు చేయాలేమో. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదిక భార్యలవుతుంది ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే విడుదల కూడా కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: