టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రతి నాయకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ఇటీవల కోటబొమ్మాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఇటీవల ఒక కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్న సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఆ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రాశి కూడా వచ్చింది. అంతేకాదు ఆ ఈవెంట్ లో వీరిద్దరూ
చాలా సరదాగా కనిపించారు. ఈవెంట్ లో పాల్గొన్న రాశి అందులో భాగంగానే శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. వేదికపై చాలా సరదాగా హిట్ పేర్ గా కనిపించిన వీరిద్దరూ చిన్నప్పటినుండి స్నేహితుల లాగా సందడి చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ ఈ విషయంపై స్పందించారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్‌లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది.
దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్‌పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్‌లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు..!!